Advertisementt

మహేష్ ని లాక్ చేసిన రాజమౌళి

Sat 25th Jan 2025 11:18 AM
rajamouli  మహేష్ ని లాక్ చేసిన రాజమౌళి
SSMB29 - Super Star to enters Lion Den మహేష్ ని లాక్ చేసిన రాజమౌళి
Advertisement
Ads by CJ

దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో రాబోతున్న ప్యాన్ వరల్డ్ సినిమా ప్రారంభం నుంచే భారీ అంచనాలు సృష్టిస్తోంది. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ దశకు చేరుకుంది. సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా ఇంటర్నేషనల్ లెవల్ లో వైరల్ అవుతోంది.

ఇప్పటికే మహేష్ బాబు, ప్రియాంకా చోప్రాలపై టెస్ట్ షూట్ పూర్తయ్యిందని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడనుంది. అయితే ఆ ప్రకటన ముందు నిన్న రాత్రి అనూహ్యంగా రాజమౌళి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ క్రేజీ ప్రమోషన్ షేర్ చేయడంతో అభిమానుల దృష్టిని మరింత ఆకర్షించారు.

రాజమౌళి ఓ ఫోటోలో సింహంని జైలులో బంధించి దాని పాస్‌పోర్ట్ తీసుకున్నట్టు చూపించారు. దీనికి మహేష్ బాబు స్పందిస్తూ, ఒకసారి కమిట్ అయితే, నా మాట నేనే వినను, అని వ్యాఖ్యానించడం అభిమానులకు మాంచి కిక్ ఇచ్చింది. ఈ పోస్టుతో సినిమా హైప్ మరింత పెరిగింది. రాజమౌళి సినిమాల ప్రత్యేకతే ఏదైనా అద్భుతంగా ప్లాన్ చేయడం. అదే ఈ ప్రమోషన్‌లోనూ కనిపిస్తోంది.

మహేష్ బాబు తరచుగా కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తుంటారు. కానీ రాజమౌళి ప్రాజెక్ట్‌లో, షూటింగ్ సమయంలో అలాంటి విరామాలు సాధ్యపడవని చమత్కారంగా పాస్‌పోర్ట్ తీసుకున్నానని అర్థం వచ్చేలా ఈ ఫోటో షేర్ చేశారు. ఈ పోస్ట్‌ను ప్రియాంకా చోప్రా కూడా లైక్ చేయడంతో ప్రేక్షకుల ఆసక్తి మరింతగా పెరిగింది.

ఇది వరకు అటవీ ప్రదేశం బ్యాక్‌డ్రాప్‌లో జంతువులు, నిధులు, సాహసాలతో ఇండియానా జోన్స్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తయారవుతున్న ఈ విజువల్ గ్రాండియర్, ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ సహా పలు భాషల్లో ఒకేసారి విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా బడ్జెట్ రూ. 1000 కోట్లకు పైగా ఉండనుందని టాక్. ఇప్పుడే హైప్ అంతగా ఉండగా, షూటింగ్ ప్రారంభం తరువాత మరిన్ని లీక్స్, అంచనాలు ఉంటాయన్నది ఖాయం. రాజమౌళి చిత్రీకరణ శైలిని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా మరో ఆణిముత్యంగా నిలుస్తుందని అభిమానులు నమ్మకంగా ఎదురుచూస్తున్నారు.

SSMB29 - Super Star to enters Lion Den:

Rajamouli snap with Lion-Mahesh witty reply

Tags:   RAJAMOULI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ