తన చిన్ననాటి ఫ్రెండ్ ఆంటోనిని ప్రేమ వివాహం చేసుకున్న కీర్తి సురేష్ పెళ్లి తర్వాత కూడా కెరీర్ ని కంటిన్యూ చేస్తుంది. పెళ్ళికి ముందు ఎంత గ్లామర్ గా కనిపించిందో పెళ్లి తర్వాత కూడా అంతే గ్లామర్ గా కనిపిస్తుంది. తాజాగా పెళ్ళికి ముందు సంగీత్ ఫొటోస్ ని షేర్ చేసింది. కీర్తి సురేష్ ఆ పిక్స్ లో ఎప్పటిలాగే బ్యూటిఫుల్ గా కనిపించింది.
భర్త ఆంటోనీతో కలిసి డాన్స్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. కీర్తి సురేష్ హిందూ సాంప్రదాయం, క్రిష్టియన్ సాంప్రదాయంలో వివాహం చేసుకుంది. కానీ ఆ ఫొటోస్ ని పొదుపుగా షేర్ చేసింది. తాజాగా భర్త తో కలిసి ఛిల్ అవుతూ ఉన్న పిక్స్ ని సోషల్ మీడియాలో పంచుకుంది. అంతేకాదు పెళ్లి కి ముందు పెళ్లి తర్వాత తన లైఫ్ లో ఎలాంటి మార్పు లేదు, అప్పుడేంత సంతోషంగా ఉన్నానో ఇప్పుడు అంతే సంతోషంగా ఉన్నాను.
కారణం మేము చాలా ఏళ్లుగా డేటింగ్ లో ఉండడం వలన ఒకరినొకరు అర్ధం చేసుకున్నాము, అందువల్లే తనకు పెద్దగా చేంజ్ కనిపించలేదు. నేను ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటాను, అది నా భర్తకు అంతగా నచ్చదు. కానీ అదేమీ ఇబ్బందిగా ఫీలవ్వడు. అర్ధం చేసుకున్నాడు కాబట్టే సర్దుకుపోతున్నాడు.
ఆంటోనిలో సర్దుకుపోయే గుణం ఉండడం వలనే తన వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగుతుంది అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. ఈమధ్యనే కీర్తి సురేష్-ఆంటోనీ థాయిలాండ్ కి హనీమూన్ వెళ్లొచ్చారు.