Advertisementt

ఫెమీనా క‌వ‌ర్‌పై ర‌ష్మిక మంద‌న్న లుక్

Sat 25th Jan 2025 09:43 AM
rashmika  ఫెమీనా క‌వ‌ర్‌పై ర‌ష్మిక మంద‌న్న లుక్
Rashmika Ravishing Look on Femina Cover ఫెమీనా క‌వ‌ర్‌పై ర‌ష్మిక మంద‌న్న లుక్
Advertisement
Ads by CJ

రష్మిక మందన్న వరుసగా ఫోటోషూట్లతో తన ప్రత్యేకతను చూపిస్తూనే ఉంది. తాజాగా ఫెమినా ఇండియా కవర్ ఫోటోషూట్‌లో రష్మిక తన చార్మ్‌తో అభిమానులను ఆకట్టుకుంది. ఈ ప్రత్యేక ఫోటోషూట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతోంది. ఫెమినా ఈ సందర్భంగా రష్మికను నేటితరంలో దూసుకుపోతున్న సూపర్ స్టార్ గా ప్రశంసించింది.

ఫెమినా పేర్కొంటూ ఈ సంవత్సరానికి రష్మిక మందన్నతో ఆరంభం చేయడం ఎంతో ప్రత్యేకం. నేటి ప్రపంచంలో సూపర్ స్టార్ అంటే ఏమిటో ఆమె తన ప్రతిభతో నిర్వచిస్తున్నారు, అంటూ ప్రశంసలు అందించింది. ప్రత్యేకంగా పుష్ప 2 సినిమాతో వచ్చిన ఘన విజయంతో రష్మిక, నేటి అత్యంత అభిమానించబడే కథానాయికల్లో ఒకరిగా నిలిచింది.

రష్మిక తన అసమాన ప్రతిభ, ఆకర్షణీయమైన ఉనికి, ప్రేక్షకులతో సరిహద్దులని దాటే కనెక్షన్ ద్వారా లక్షలాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఫెమినా ఈ విషయంపై ప్రత్యేక కథనాన్ని షేర్ చేస్తూ, రష్మిక ప్రపంచాన్ని ఆకర్షించే సామర్థ్యం కలిగిన స్టార్ అని పేర్కొంది.

ఈ ఫోటోషూట్‌తో రష్మిక తన అందం, ప్రతిభ, ఆత్మవిశ్వాసాన్ని మరోసారి ప్రదర్శించింది. రష్మిక మందన్నకు ఉన్న ఆదరణ, ఇమేజ్ మరింత పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Rashmika Ravishing Look on Femina Cover:

Rashmika looks in Femina

Tags:   RASHMIKA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ