టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం జాక్ శరవేగంగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమా తో పాటు తెలుసు కదా, కోహినూర్ వంటి ప్రాజెక్ట్‌లను కూడా సిద్ధు ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక తాజాగా మరో ప్రముఖ డైరెక్టర్‌తో సిద్ధు ఓ కొత్త సినిమా చేయబోతున్నాడన్న వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
గీతా గోవిందం, సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ సినిమాలతో గుర్తింపు పొందిన దర్శకుడు పరశురామ్ పెట్లా, ఓ పవర్‌ఫుల్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ కథను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి వినిపించగా, దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆ తర్వాత ఈ కథను సిద్ధు జొన్నలగడ్డకు కూడా చెప్పగా, కథ బాగా నచ్చడంతో ఆయన కూడా ఒప్పుకున్నట్లు సమాచారం.
ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, సిద్ధు పాత్ర గురించి సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే, ఇది సిద్ధు కెరీర్‌కు మరింత బూస్ట్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.