కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార కన్నడ పాన్ ఇండియా స్టార్ యష్ టాక్సిక్ చిత్రంలో హీరోయిన్ కాదు యష్ కి సిస్టర్ గా నటించబోతుంది అనే ప్రచారం చూసి నయనతార స్టార్ హీరోకి అక్కగా నటించడమేమిటి అంటూ ఆమె అభిమానులు చాలా షాకయ్యారు. కియారా అద్వానీ హీరోయిన్, నయన్ యష్ కి అక్క అన్నారు.
గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార నటిస్తుంది అనే విషయాన్ని టాక్సిక్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. అక్షయ ఒబెరాయ్ బాలీవుడ్ నటుడు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రస్తుతం రాకింగ్ స్టార్ స్టార్ యష్ చిత్రమైన టాక్సిక్ లో నటిస్తున్నాను, ఈ చిత్రంలో నయనతార కూడా భాగమయ్యారు.
ఇంతకుమించి ఇతర విషయాలను రివీల్ చెయ్యలేను, త్వరలోనే దర్శకురాలు గీతు మోహన్ దాస్ ఓ ప్రకటన చేస్తారు అంటూ ఈ చిత్రంలో నయనతార నటిస్తున్న విషయాన్ని అక్షయ ఒబెరాయ్ కంఫర్మ్ చేసాడు.