నందమూరి బాలకృష్ణ పక్కన హీరోయిన్స్ గా నటించేందుకు హీరోయిన్స్ మొగ్గు చూపడం లేదో, లేదంటే బాలయ్యకు సూట్ అవడం లేదో కానీ.. ఆయన ఈ మధ్యన చేసే సినిమాల హీరోయిన్స్ విషయంలో దర్శకులు కిందా మీదా పడుతున్నారు. అఖండ లో నటించిన ప్రగ్య జైస్వాల్, నిన్నగాక మొన్నొచ్చిన డాకు మహారాజ్ లోను హీరోయిన్ గా నటించింది.
ఇప్పుడు రాబోయే అఖండ 2 తాండవం లో కూడా ప్రగ్య జైస్వాల్ నే హీరోయిన్ గా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారు. అఖండ కు సీక్వెల్ అది. సో ప్రగ్యానే హీరోయిన్ అనుకున్నారు. కానీ తాజాగా బాలయ్య హీరోయిన్ మారింది. అఖండ 2 లోకి సంయుక్త మీనన్ హీరోయిన్ గా ఎంటర్ అయ్యింది.
అఖండ 2 మేకర్స్ సంయుక్త హీరోయిన్ గా బాలయ్య సరసన ఈ చిత్రంలో నటించబోతున్నట్టుగా ప్రకటించారు. సో అఖండ 2 మెయిన్ లీడ్ లో మనం సంయుక్త మీనన్ ని చూడొచ్చు.