గత మూడు రోజులుగా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లో అలాగే ఆయన ఆఫీసుల్లో ఐటి అధికారుల సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో ఐటి అధికారులు దిల్ రాజు ఇంట్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆయన తెరకెక్కించిన సినిమాల నుంచి వచ్చిన లాభాలకు GST చెల్లింపులు దిల్ రాజు చేయలేదని అంటున్నారు.
ఈరోజు నాలుగో రోజు కూడా దిల్ రాజు ఇంట్లో, ఆఫీసుల్లో అధికారులు సోదాలు నిర్వహిసున్నారు. తాజాగా ఐటి అధికారులు దిల్ రాజుని తమ కారులో తీసుకువెళ్లడం టాపిక్ అయ్యింది. దిల్ రాజు ఇంటి నుంచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు దిల్ రాజుని సాగర్ సొసైటీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి తీసుకెళ్ళారు.
అక్కడ SVC కార్యాలయంలో కొనసాగుతున్న ఐటీ సోదాలు. అవి పూర్తి కాగానే దిల్ రాజు మీడియా మీట్ నిర్వహించే అవకాశం ఉంది.