కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో త్రిష డేటింగ్ అంటూ కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో చాలా రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. విజయ్ త్రిష కోసం తన భార్యకు విడాకులు కూడా ఇవ్వబోతున్నాడు, త్రిష కోసం విజయ్ ఏదైనా వదులుకోవడానికి సిద్ధమయ్యాడనినే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
త్రిష కానీ, విజయ్ కానీ ఈ రూమర్స్ ని ఖండించడం లేదు. తాజాగా త్రిష తన స్నేహితుడుగా చెప్పుకునే విజయ్ కోసం ఓ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోబోతుందట. విజయ్ సినిమా లకు స్వస్తి చెప్పి రాజకీయాల్లో భాగం అవ్వాలనే ఉద్దేశ్యంతో పార్టీ పెట్టి పోరాడుతున్నాడు. చివరి సినిమాగా ఆయన భగవంత్ కేసరి రీమేక్ చేస్తున్నారు. ఇది పూర్తి కాగానే విజయ్ పూర్తి స్థాయి రాజకీయనాయకుడిగా సెటిల్ అవుతారు.
త్రిష కూడా తన స్నేహితుడు విజయ్ కోసం రాజకీయ అరంగేట్రం చేసే ఆలోచనలో ఉంది అని, త్వరలోనే త్రిష విజయ్ పెట్టిన పార్టీలో చేరబోతుంది అనే వార్త కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన త్రిష పీక్ స్టేజ్ లో సినిమాలు వదిలేసి రాజకీయాల కోసం వెళుతుందా, ఫ్రెండ్ కోసం సినిమాలు వదులుంటుందా అంటూ ఆమె అభిమానులే మాట్లాడుకుంటున్నారు.