యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు, వార్ 2 షూటింగ్ కి బ్రేక్ రావడంతో ఫ్యామిలీతో కలిసి లండన్ ట్రిప్ వేసిన ఎన్టీఆర్.. ఆ తర్వాత ఒంటరిగా సంక్రాంతి పండుగ ముందు స్కాట్లాండ్ లో కనిపించాడు. సంక్రాంతి అవ్వగానే ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం నీల్ మూవీ సెట్స్ లోకి అడుగుపెడతారని అన్నారు.
అది కూడా కర్ణాటక నుంచి ఎన్టీఆర్-నీల్ మూవీ మొదలవుతుంది. మొదటి షెడ్యూల్ అక్కడే జరుగుతుంది అన్నారు. మరి సంక్రాంతి వెళ్లి వారం అయ్యింది. ఇప్పటివరకు ఎన్టీఆర్-నీల్ మూవీ అప్ డేట్ లేదు. అసలు ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ విషయంలో ఏం జరుగుతుంది అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త ఆందోళన పడుతున్నారు.
ప్రశాంత్ నీల్ కూడా సైలెంట్ గా ఉన్నారు, ఎన్టీఆర్ అసలు హైదరాబాద్ లో ఉన్నాడో, లేడో అనేది అభిమానులకు అర్ధం కావడం లేదు. మరి మైత్రి వారు ఐటి రైడ్స్ తో సతమవుతున్నారు. అది ఓ కొలిక్కి వచ్ఛాక ఏమైనా ఎన్టీఆర్-నీల్ మూవీ రెగ్యులర్ షూట్ మొదలవుతుందేమో చూడాలి.