అవును అల్లుడు వచ్చేవరకు టాలీవుడ్ లో మామదే హవా నడిచేలా కనబడుతుంది. సంక్రాంతి స్పెషల్ గా జనవరి 14 న విడుదలైన వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ప్రస్తుతం బాక్సాఫీసు కలెక్షన్స్ తిరగరాస్తుంది. అనిల్ రావిపూడి కామెడీ డైలాగ్స్ కి, వెంకీ కామెడీ టైమింగ్ అన్ని ప్రేక్షకులను ముగ్దులను చేస్తుంది
సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బ్లాక్ బస్టర్ అవడమే కాదు, కామెడీకి కనెక్ట్ అవడంతో ఆడియన్స్ ఇంకా ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఇప్పటికే 200 కోట్ల మార్క్ ని దాటేసిన సంక్రాంతి వస్తున్నాం కి ఈ వారం విడుదల కాబోయే సినిమాలకు అడ్డుకట్ట వేసే దమ్ము కనిపించడం లేదు. అది ఫిబ్రవరి 7 న నాగ చైతన్య సినిమా తండేల్ వచ్చేవరకు సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి అడ్డు కట్ట పడేలా లేదు.
అందుకే అనేది అల్లుడు చైతు వచ్చేవరకు వెంకిమామ హవా కొనసాగేలానే కనబడుతుంది. ఫిబ్రవరి 7 న నాగ చైతన్య-సాయి పల్లవి కలయికలో చందు మొండేటి తెరకెక్కించిన తండేల్ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే తండేల్ సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
మరోపక్క సంక్రాంతి సినిమాలను తట్టుకోలేక మీడియం చిత్రాలేవీ వచ్చేందుకు మొగ్గు చూపడం లేదు. సో తండేల్ వచ్చేవరకు సంక్రాంతికి వస్తున్నాం కి ఎదురు లేదన్నమాట.