Advertisementt

పెళ్లి-పిల్లలపై జాన్వీ కపూర్ డ్రీమ్స్

Thu 23rd Jan 2025 07:37 PM
janhvi kapoor  పెళ్లి-పిల్లలపై జాన్వీ కపూర్ డ్రీమ్స్
Janhvi shares her marriage dreams పెళ్లి-పిల్లలపై జాన్వీ కపూర్ డ్రీమ్స్
Advertisement
Ads by CJ

అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా పరిచయమైన జాన్వీ కపూర్ తన అద్భుతమైన నటనతో బాలీవుడ్‌ను మెప్పిస్తూనే తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. దేవర 2, ఆర్సీ 16 వంటి పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ఈ యువ నటి తాజాగా కరణ్ జోహార్ షోలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

నేను పెళ్లి చేసుకున్న తర్వాత తిరుమలలోనే స్థిరపడాలని ఉంది. భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి ప్రతిరోజూ అరటి ఆకులో అన్నం తింటూ.. గోవిందా గోవిందా అంటూ భగవంతుడిని స్మరించుకోవాలని ఉంది. మణిరత్నం సినిమాల సంగీతం వింటూ హాయిగా గడపాలని ఉంది అని జాన్వీ తెలిపింది.

తిరుమల వేంకటేశ్వర స్వామిపై జాన్వీకి ఉన్న భక్తి ఎంతో ప్రత్యేకమైనది. తనకు సమయం దొరికినప్పుడల్లా ఆమె తిరుమలకు వెళ్లి స్వామిని దర్శించుకుంటుంది. ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కూడా తిరుమలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకోవడం ఆమె అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

సినిమాల్లో గ్లామర్‌గా కనిపించే జాన్వీ, నిజ జీవితంలో చాలా సరళమైన మనసు కలిగిన వ్యక్తి అని ఈ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. తిరుమలలో సాధారణ జీవితం గడపాలనే ఆమె కోరిక అభిమానుల మనసులను కదిలిస్తోంది.

Janhvi shares her marriage dreams:

Janhvi Kapoor on her marriage and kids

Tags:   JANHVI KAPOOR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ