Advertisementt

రష్మిక నోట రిటైర్మెంట్ మాట

Thu 23rd Jan 2025 03:46 PM
rashmika  రష్మిక నోట రిటైర్మెంట్ మాట
Rashmika Speaks About Retirement After Chhaava రష్మిక నోట రిటైర్మెంట్ మాట
Advertisement
Ads by CJ

ప్రస్తుతం నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న, బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చావా చిత్రంలో కథానాయికగా మెరవనుంది. ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని దినేష్ విజయన్ దివ్యంజలి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ముంబైలో జరిగిన చావా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రష్మిక తన అనుభవాలను పంచుకుంది. ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్ భార్య ఏసుబాయి పాత్రను పోషించే అవకాశం రావడం తనకు పెద్ద గౌరవంగా భావిస్తున్నానని చెప్పింది. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ గారు ఈ పాత్రను ఎంతో ప్రాముఖ్యంతో డిజైన్ చేశారని, ఇలాంటి పాత్ర చేసిన తర్వాత ఒక నటిగా మరింత గర్వపడుతున్నానని తెలిపారు.

చావా షూటింగ్ సమయంలో తనకు చాలా సార్లు భావోద్వేగానికి లోనయ్యానని, ఈ సినిమా తనకు జీవితాంతం గుర్తుండిపోయే ఒక ప్రత్యేక అనుభవమని రష్మిక పేర్కొంది. తాను దర్శకుడితో ఒకసారి మాట్లాడుతూ.. ఇలాంటి పాత్ర చేసిన తర్వాత నేను రిటైర్ అయినా సరే ఎలాంటి అభ్యంతరం లేదు అని అనిపించిందని రష్మిక వ్యాఖ్యానించింది. ఈ సినిమాలో తన పాత్ర ద్వారా ప్రేక్షకులకు ఒక కొత్త కోణంలో కనిపించేందుకు అవకాశం దొరికిందని చెప్పిన ఆమె, సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వెల్లడించింది.

Rashmika Speaks About Retirement After Chhaava:

Rashmika talks about her retirement during the movie Chhavaa

Tags:   RASHMIKA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ