రైటర్ గా తనకి గుర్తింపు రావడం లేదు అంటూ దర్శకుడిగా మారి.. చేసిన సినిమాలన్నీ విజయ బావుటా ఎగరేయ్యడం, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్న అనిల్ రావిపూడి డైరెక్టర్ గా మారి పదేళ్లు అవ్వడంతో ఈ దర్శకుడికి అందరూ శుభాకంక్షాలు తెలియజేస్తున్నారు. పటాస్ కథతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేద్దామని కలలు కన్న అనిల్ రావిపూడి మొదటి హీరోగా కళ్యాణ్ రామ్ తగిలాడు. అప్పుడు మొదలు పెట్టిన సక్సెస్ ని నిన్నమొన్నటి సంక్రాంతికి వస్తున్నాం వరకు అనిల్ రావిపూడి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు.
సక్సెస్ అంటే అనిల్ రావిపూడి, అనిల్ రావిపూడి అంటే సక్సెస్ అన్న రేంజ్ లో ఆయన పదేళ్ల కెరీర్ కనిపిస్తుంది. కళ్యాణ్ రామ్ తో పటాస్, సాయి ధరం తేజ్ తో సుప్రీం, రవితేజ తో రాజా ది గ్రేట్, వెంకటేష్-వరుణ్ తేజ్ లతో F2, ఆ తర్వాత స్టార్ హీరో మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమా తీసి హిట్ కొట్టారు అనిల్.
F2కి సీక్వెల్ గా వరుణ్-వెంకీలతో F3 అంటూ మరో సినిమా తీశారు. అన్ని హిట్లే. F3 తర్వాత సీనియర్ హీరో బాలయ్య ను లైన్ లో పెట్టి తన కామెడీ జోనర్ ని పక్కనపెట్టి భగవంత్ కేసరి అంటూ ఎమోషనల్ కంటెంట్ తో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆతర్వాత ముచ్చటగా మూడోసారి వెంకీ మామ తో సంక్రాంతికి వస్తున్నాం అంటూ భారీ బ్లాక్ బస్టర్ అంటే మొదటిసారి అనిల్ రావిపూడి కెరీర్ లోనే 200 కోట్ల ఫిలిం తో సత్తా చాటారు.
ఐదు సినిమాలు వరుసగా 100 కోట్లు కలెక్ట్ చేయగా, ఐదు సినిమాలు యూఎస్ లో 1 మిలియన్ మార్క్ దాటేశాయి. ఏ దర్శకుడు అందుకోని రేర్ ఫీట్ ని అనిల్ రావిపూడి సాధించారు. కెరీర్ లో ఎనిమిది సినిమాలు, ఎనిమిదీ హిట్. అనిల్ రావిపూడితో సినిమా అంటే హిట్ అనే లెక్కలోకి వచ్చేసారు సదరు ప్రేక్షకులు.
సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే అప్పుడే అనిల్ రావిపూడి తన తదుపరి హీరో ని లైన్ లో పెట్టేసారు. మెగాస్టార్ చిరుతో అనిల్ తన తదుపరి ప్రాజెక్ట్ చెయ్యబోతున్న విషయం తెల్సిందే. పదేళ్లు, ఎనిమిది సినిమాల సక్సెస్ లతో అద్భుతమైన కెరీర్ ను కొనసాగిస్తున్న అనిల్ రావిపూడి ఇకపై మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటూ.. సినీజోష్ టీమ్ తరుపున ఆల్ ద బెస్ట్.