దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈమధ్యన మారిపోయాను, ఇకపై సత్య లాంటి సినిమాలే చేస్తాను, ఇప్పటివరకు తీసిన సినిమాల విషయంలో సిగ్గుపడుతున్నా అంటూ, నిన్న బుధవారం సిండికేట్ మూవీని ఎనౌన్స్ చేసిన కొద్ధి గంటల్లోనే ముంబై లోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు రామ్ గోపాల్ వర్మకీ బిగ్ షాక్ ఇచ్చింది.
చెక్ బౌన్స్ కేసులో RGV కి మూడు నెలల జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా తేల్చి మూడు నెలల పాటు ఆయనకు జైలు శిక్ష విధిస్తూ ముంబైలోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును వెల్లడించింది. మరోపక్క ఏపీలోనూ రామ్ గోపాల్ వర్మపై కేసులు నమోదు అయ్యాయి.
పోలీసులకు చిక్కకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్న వర్మ తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నీ నా సినిమాను ప్రమోషన్ చేసుకోవడానికేనని సింపుల్ గా తేల్చేసాడు.