Advertisementt

పుష్ప 2 ఓటీటీ డేట్ వచ్చేస్తుంది

Thu 23rd Jan 2025 11:32 AM
pushpa 2  పుష్ప 2 ఓటీటీ డేట్ వచ్చేస్తుంది
Pushpa 2 OTT date will come పుష్ప 2 ఓటీటీ డేట్ వచ్చేస్తుంది
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సాధించిన పుష్ప 2 సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై ప్రేక్షకులు భారీ ఆశలు పెట్టుకున్నారు. సాధారణంగా అన్ని పెద్ద సినిమాలు థియేటర్ రిలీజ్ అయిన నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత ఓటీటీలో వస్తుంటాయి. అయితే పుష్ప 2 విషయంలో మాత్రం రీలోడెడ్ వర్షన్ విడుదల చేయడంతో స్ట్రీమింగ్ ఆలస్యమైంది. చివరికి ఎనిమిదో వారానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం.

బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 1900 కోట్ల వసూళ్లతో దుమ్ములేపిన పుష్ప 2, రీలోడెడ్ వర్షన్ రూపంలో థియేటర్లలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. ఈ వెర్షన్‌కు థియేటర్లలో వచ్చిన స్పందన కారణంగా ఓటీటీ విడుదలను మరింత వాయిదా వేశారు. తాజా సమాచారం ప్రకారం, జనవరి 30 లేదా 31న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.

తెలుగుతో పాటు హిందీ, దక్షిణ భారత భాషల్లో విడుదలైన పుష్ప 2 హిందీ మార్కెట్‌లోనే రూ.1000 కోట్ల వసూళ్లు సాధించింది. అంతేకాక, పుష్ప 2 విదేశీ భాషల్లో కూడా విడుదల చేసి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. పుష్పరాజ్ కథను సుమారు 3 గంటల 40 నిమిషాల పాటు రీలోడెడ్ వర్షన్‌గా ఓటీటీలో చూడవచ్చు. పుష్ప 2 భారీ అంచనాలను అందుకుంటూ ఓటీటీ ప్రేక్షకుల హృదయాలను ఎలా గెలుచుకుంటుందో చూడాలి.

Pushpa 2 OTT date will come:

Pushpa 2 OTT details out

Tags:   PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ