మాస్ ఆడియన్స్ కు యాక్షన్ చిత్రాలు ఎక్కినట్టుగా మరే చిత్రాలు నచ్చవు. అందుకే చాలా సినిమాలు కథలు కనెక్ట్ అవ్వకపోయినా యాక్షన్ వెరైటీగా ఉంటే సినిమాలు హిట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక యాక్షన్ మూవీస్ కాకుండా మరో జోనర్ అంటే కామెడీ కంటెంట్ ఇష్టపడేవాళ్ళకు యాక్షన్ అవసరమే లేదు.
ఈ సంక్రాంతికి మాత్రం యాక్షన్ పై కామెడీ గెలిచింది అనే చెప్పాలి. నందమూరి బాలకృష్ణ-బాబీ లు డాకు మహారాజ్ అంటూ యాక్షన్ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకు రాగా.. కామన్ ఆడియన్స్ కు డాకు సో సో గా ఉన్నా మాస్ ఆడియన్స్ కు, నందమూరి అభిమానులకు సినిమా బాగా నచ్చేసింది. అటు ఇటుగా డాకు మహారాజ్ కూడా 100 కోట్లకు పైగానే వసూళ్లు చేసింది.
అయితే డాకు హవా అంతా సంక్రాంతి వస్తున్నాం అనే చిత్రం వచ్చేవరకు సాగింది. జనవరి 14 న సంక్రాంతి పండుగ రోజు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విడుదల అయ్యింది, అంతే ఫ్యామిలీ ఆడియన్స్, కామెడీ ఆడియన్స్ మొత్తం సంక్రాంతికి వస్తున్నాం కే క్యూ కట్టారు. దానితో యాక్షన్ చిత్రమైన డాకు మహారాజ్ కన్నా సంక్రాంతికి వస్తున్నాం కి కలెక్షన్స్ వరద పారింది.
డాకు కన్నా సంక్రాంతికి వస్తున్నాం కి వచ్చిన కల్లెక్షన్స్ ఎక్కువ, వెంకీ కేరీర్లోనే 200 కోట్ల మార్క్ తో సంక్రాంతికి వస్తున్నాం రికార్డ్ సృష్టించింది.