Advertisementt

రాజా సాబ్ షూటింగ్ అంత మిగిలి ఉందా

Thu 23rd Jan 2025 10:04 AM
raja saab  రాజా సాబ్ షూటింగ్ అంత మిగిలి ఉందా
Raja Saab shooting update రాజా సాబ్ షూటింగ్ అంత మిగిలి ఉందా
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి తర్వాత ముందుగా మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ విడుదల చేసేందుకు షూటింగ్ కంప్లీట్ చేసేస్తున్నారు. మధ్యలో కాలు బెణకడంతో కాస్త బ్రేక్ తీసుకున్న ప్రభాస్ ఇటు రాజా సాబ్ అటు హను రాఘవపూడి తో ఫౌజీ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. అయితే ఏప్రిల్ లో రావాల్సిన రాజాసాబ్ విడుదలపై సోషల్ మీడియా లో రకరకాల వార్తలు వినవస్తున్నాయి. 

కారణం రాజా సాబ్ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు, అందుకే సంక్రాంతికి రాజా సాబ్ టీజర్ కూడా ఇవ్వలేదు, కాబట్టే ఏప్రిల్ లో రాజా సాబ్ వచ్చే అవకాశం లేదు అంటున్నారు. దానితో అసలు రాజా సాబ్ షూటింగ్ ఎంతవరకు పూర్తయ్యిందో అనే విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా కనబడుతున్నారు. 

తాజాగా రాజా సాబ్ షూటింగ్ ప్రస్తుతం స్పీడుగానే నడుస్తుంది. ఈ నెలాఖరు వరకు హీరో లేని ఫైట్ సీన్స్ ని మారుతి చిత్రీకరిస్తారని, వచ్చే నెల 10 రోజుల వర్క్ ఉంటుందట. ఆ షెడ్యూల్ లో హీరో ప్రభాస్ పాల్గొంటారట. దాంతో పాటలు మినహా మిగిలిన వర్క్ అంతా పూర్తవుతుంది అని తెలుస్తోంది. పాటల కోసం మరో 20 డేస్ స్పెండ్ చేస్తారని మార్చ్ కల్లా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది అని సమాచారం. 

Raja Saab shooting update :

Prabhas Raja Saab shooting update

Tags:   RAJA SAAB
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ