స్టార్ హీరోల సినిమాలు నిర్మించిన నిర్మాతలు సినిమాలు విడుదల చేసాక మంచి టాక్ వస్తే.. ఫస్ట్ డే, 2nd డే కలెక్షన్స్, 5 డేస్, వన్ వీక్ కలెక్షన్స్ పోస్టర్స్ అంటూ హడావిడి చేస్తారు. ఆ పోస్టర్లు ఎందుకు, నిజంగానే అన్ని కలెక్షన్స్ వస్తున్నాయా అంటే.. అభిమానుల కోసమే ఆ ఫిగర్స్ వేస్తాము, వారిని శాటిస్ఫై చెయ్యడానికే అలా కలెక్షన్స్ పోస్టర్స్ అంటూ నిర్మాతలు చాలా సందర్భాల్లో చెబుతున్నారు.
ఇకపై అలాంటి కలెక్షన్స్ పోస్టర్స్ వేసి అభిమానుల కోసమే అంటే కుదరదు, ఐటి వాళ్లొచ్చి తాట తీస్తారు. ఇపుడు టాలీవుడ్ లో నడిచేది అదే. స్టార్ హీరోల సినిమాలకు సూపర్ హిట్ కలెక్షన్స్ పోస్టర్స్ వచ్చిన తదుపరి ఆ నిర్మాతల ఇంటికి ఐటి అధికారులు వెళతారు. గతంలో పుష్ప 1 నిర్మాతలపై ఇలాంటి ఐటి దాడులే జరిగాయి.
ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన సినిమాల నిర్మాత తో పాటుగా గా, పుష్ప 2 నిర్మాతలపై ఐటి అధికారుల దాడులకు సాక్ష్యం.. కలెక్షన్స్ పోస్టర్స్ మాత్రమే. రెండు రోజుల నుంచే దిల్ రాజు, మైత్రి మూవీస్ మేకర్స్ తో పాటుగా పుష్ప 2 లాభాల్లో వాటా తీసుకున్న సుకుమార్ ఇంటిపైన ఐటి దాడులు జరగడం చూస్తున్నాము.
అందుకే అభిమానుల కోసమే కలెక్షన్స్ పోస్టర్స్ అని వేస్తె ఇకపై తాట తీస్తారు ఐటి ఆధికారులు. ఈ సున్నితమైన విషయాన్ని మేకర్స్ ఎలా డీల్ చేస్తారో చూడాలి.