శివ, క్షణక్షణం, గాయం, రంగీల, సత్య, కంపెనీ, సర్కార్ లాంటి క్రేజీ చిత్రాలు తీసిన రామ్ గోపాల్ వర్మ ఆఫీసర్, ఎన్టీఆర్ లక్ష్మి పార్వతి, ఐస్ క్రీం, వ్యూహం లాంటి చెత్త సినేమాలు చేసి తనపై ఉన్న నమ్మకాన్ని మొత్తం పోగొట్టుకున్నాడు. వరసగా పిచ్చిపిచ్చి సినిమాల్తో, చెత్త చెత్త కామెంట్స్ తో రామ్ గోపాల్ వర్మ తనపై నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాడు.
కూటమి ప్రభుత్వం వచ్చాక తనలోని మార్పుని చూపిస్తున్న రామ్ గోపాల్ వర్మ తాజాగా సత్య సినిమా చూసాను, ఇకపై ఇలాంటి గొప్ప సినిమాలనే చేస్తాను, మీకు మాటిస్తున్నాను అంటూ చెప్పిన మరుసటి రోజే వర్మ గారు తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసారు.
తాజాగా RGV తన నెక్ట్స్ సినిమా ప్రకటించారు. సిండికేట్ టైటిల్ తో సినిమా తీయబోతున్నట్లుగా RGV ప్రకటించారు. తన సినీ జీవితంలో తొలిసారి బిగ్గెస్ట్ ఫిల్మ్ చేయబోతున్నట్లు వెల్లడించిన ఆర్జీవీ.. సత్య లాంటి గొప్ప సినిమా తీస్తాననే మాటను నిలబెట్టుకుంటానని మరోసారి మాట కూడా ఇచ్చేసారు.