Advertisementt

వీల్ చైర్ లో కనిపించిన రష్మిక

Wed 22nd Jan 2025 03:57 PM
rashmika  వీల్ చైర్ లో కనిపించిన రష్మిక
Rashmika spotted in wheel chair వీల్ చైర్ లో కనిపించిన రష్మిక
Advertisement
Ads by CJ

పుష్ప ద రూల్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రష్మిక మందన్న ఆ తర్వాత దాని సక్సెస్ లో అంతగా పాలు పంచుకోలేకపోయింది. మరోపక్క బిజీ షెడ్యూల్స్ అంటూ షూటింగ్స్ లో పాల్గొంటున్న రష్మిక మందన్న ఈమధ్యన జిమ్ చేస్తూ గాయపడింది. కాలుకు కట్టు వేసుకుని తనకు ప్రమాదం జరిగిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

కొద్దిరోజులుగా రెస్ట్ లో ఉన్న రష్మిక మందన్న తాజాగా వీల్ చైర్ లో కనిపించి షాకిచ్చింది. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో వీల్ చైర్ లో కూర్చొని రష్మిక కనిపించడమే కాదు, ఆమె కారు నుంచి దిగడానికి ఇబ్బంది పడుతూ కనిపించింది. ఒకే కాలితో కారు నుంచి దిగి కుంటుతూ వీల్ చైర్ లో కూర్చుంది. 

రష్మిక కుంటుతూ వీల్ చైర్ లోకి ఎక్కిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఇది చూసిన నెటిజన్లు రష్మిక త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. 

Rashmika spotted in wheel chair:

Fans worried as Rashmika spotted in wheel chair

Tags:   RASHMIKA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ