ప్రభాస్ కి పెళ్లవ్వలేదు కానీ.. ఆయన్ని పెళ్లి చేసుకోవాలని చాలామంది అమ్మాయిలు కలలు కనే ఉంటారు. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకోలేదు. అనుష్క తో ప్రభాస్ ప్రేమ, పెళ్లి అనే వార్తలు ఇప్పటివి కావు, అటు అనుష్కని చేసుకోడు, ఇటు మరో అమ్మాయిని చేసుకోడు. మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ గా ప్రభాస్ మిగిలిపోతాడేమో అని అందరూ తెగ బాధపడిపోతున్నాడు.
ఓ హీరోయిన్ అయితే తనకి ప్రభాస్ లాంటి భర్త కావాలంటుంది. ఆమె ఎవరో కాదు రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం తో సక్సెస్ అందుకున్న మీనాక్షి చౌదరి. ఆమె తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలేమిటో చెబుతుంది. తాను చేసుకోబోయేవాడికి హైట్ ఉండాలి, మంచి మనసు ఉండాలి, అంతేకాకుండా ఇంటెలిజెంట్ అయి ఉండాలి. సాధారణంగా ఓ అబ్బాయిలో నాకు కావాల్సిన అంశాలు ఇవే.
నేను మంచి హైట్‌గా ఉంటాను. నా ఎత్తు 5.8 అడుగుల ఎత్తు. కాబట్టి నా ఎత్తుకు తగిన అబ్బాయి కావాలని కోరుకొంటాను. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి ప్రభాస్. నాకు హైట్ కు సరిపోయే హైట్ ఉంటాడు. ప్రస్తుతం ప్రభాస్ అంటే నాకు క్రష్. ఆయనంటే చాలా ఇష్టం. అందంగా ఉంటాడు, హైట్ గా ఉంటాడు... అందుకే అలాంటి వ్యక్తిని పెళ్లి మీనాక్షి చెప్పుకొచ్చింది.