పెళ్ళై నెలైంది. చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని వివాహం చేసుకున్న కీర్తి సురేష్ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటిలాగే యాక్టీవ్ గా ఉంటుంది. మెడలో తాళి బొట్టుతోనే కీర్తి సురేష్ అందాల ప్రదర్శన చేస్తుంది. ఆంటోనీతో కలిసి రీసెంట్ గానే హనీమూన్ ట్రిప్ వేసిన కీర్తి సురేష్ పొంగల్ ని ఫ్యామిలీతో భర్త, స్నేహితులతో కలిసి చేసుకుంది.
పెళ్ళికి ముందే బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ అక్కడ నటించిన బేబీ జాన్ రిజల్ట్ ఎలా ఉన్నా అమ్మడు మాత్రం గ్లామర్ పరంగా బాలీవుడ్ కి కనెక్ట్ అయ్యింది. బేబీ జాన్ ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ గ్లామర్ అక్కడి ప్రముఖులను ఆకట్టుకుంది.
తాజాగా బ్లాక్ శారీ లో మరోసారి కీర్తి సురేష్ మెస్మరైజ్ చేసింది. అందంగా ఆకట్టుకుంది. చీర కట్టులోనూ తగ్గేదేలే అంటూ కీర్తి సురేష్ విసిరిన వలపు వలకు ఆమె భర్త ఏమైపోతాడో తెలియదు కానీ యూత్ మొత్తం ఫిదా అవుతుంది.