మెగాస్టార్ చిరు అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారా, అందుకే విశ్వంభర రిలీజ్ తేదీ పై ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారా, వసిష్ఠ అవుట్ ఫుట్ నచ్చినా ఆయన విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో చిరు అసంతృప్తిగా ఉన్నారా.. ఇవే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో మెదులుతున్న ప్రశ్న. జనవరి 10 కె విడుదల కావాల్సిన విశ్వంభర గేమ్ చేంజర్ కోసం త్యాగం చేసారు అన్నారు, ఆతర్వాత కొత్త డేట్ ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటికి ఇవ్వలేదు.
కారణం విశ్వంభర గ్రాఫిక్స్ పై వచ్చిన విమర్శలే. అందుకే మెగాస్టార్ దగ్గరుండి విశ్వంభర కు సంబందించిన ప్రతి పని చూసుకుంటున్నారట. గతంలో ఆచార్య ఆ తర్వాత భోళా శంకర్ రిజల్ట్స్ వలె విశ్వంభర విషయంలో జరగకూడదు అని చిరు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని వినికిడి.
ఇక విశ్వంభరను మార్చి 28 కానీ, లేదంటే మే 9 న కానీ విడుదల చెయ్యాలనే ఆలోచనలో చిరు ఇంకా మేకర్స్ ఉన్నారట. వసిష్ఠ మాత్రం గ్రాఫిక్స్ పనులు మరో కంపెనీకి అప్పజెప్పి ఈసారి ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా ఉండాలని శతవిధాలా కష్టపడుతున్నాడని టాక్.