బ్యూటిఫుల్ గర్ల్ శ్రీలీల జోరు మళ్లీ మొదలైంది. టాలీవుడ్ లో అమ్మడు స్పీడుకు బ్రేకులు వేసిన యువహీరోలు, మరోసారి శ్రీలీల నామ జపం చేస్తున్నారు. ప్రస్తుతం రవితేజ మాస్ జాతరతో జోడి కడుతున్న శ్రీలీల, నితిన్ తో కలిసి రాబిన్ హుడ్ మూవీ చేస్తుంది. అదే కాదు ఇంకా నాగ చైతన్య-కార్తీక్ దండు చిత్రంతో పాటుగా, అఖిల్ సరసన కూడా అమ్మడు ప్లేస్ సంపాదించింది అనే టాక్ ఉంది.
ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండీ ఫొటోస్ తో మెస్మరైజ్ చేసే శ్రీలీల తాజాగా వదిలిన పిక్ చూస్తే మాత్రం యూత్ కి షివరింగ్ తెప్పిస్తుందా అన్నంతగా అందాలు ఆరబోసింది. లూజ్ హెయిర్, షర్ట్ బటన్ తీసి జెబ్బ జారవిడిచి హాట్ గా కనిపించిన శ్రీలీల ని ఇలా చూస్తే షివరింగ్ కాక ఇంకేం వస్తుంది.
ఈమధ్యన అమ్మడు బాలీవుడ్ లో కనిపిస్తుంది. అక్కడ అబ్రాహిం అలీ ఖాన్ తో ఓ చిత్రానికి సైన్ చేసింది అనే టాక్ ఉన్నా అఫీషియల్ గా క్లారిటీ అయితే లేదు.