సంక్రాంతి సినిమాలు తెచ్చిన తిప్పలు అన్నట్టుగా దిల్ రాజు ఇంటి చుట్టూ ఐటి అధికారులు కాపు కాసారు. నిన్న మంగళవారం ఉదయం 8 గంటల నుంచే ఐటి అధికారులు దిల్ రాజు ఇల్లు, ఆఫీసులు, ఆయన తమ్ముడు శిరీష్, కుమార్తె హన్షిత రెడ్డి ఇంట్లోనూ, ఇంకా మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులపై దాడులు నిర్వహించారు. నిన్న అర్ధరాత్రి వరకు సోదాలు చేపట్టిన అధికారులు ఈరోజు కూడా సోదాలను కంటిన్యూ చేసారు.
ఈ రోజు బుధవారం కూడా హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఐటీ సోదాలు. ఎస్‌వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు. సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై ఆరా తీసిన అధికారులు. పుష్ప-2 బడ్జెట్, వచ్చిన ఆదాయంపై అధికారుల ఆరా తీస్తున్నారు. ఐటీ రిటర్న్స్ భారీగా ఉండడంతో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు.
నిన్న దిల్ రాజు భార్య తేజస్వినితో.. బ్యాంకు లాకర్లు తెరిపించిన అధికారులు.. ఈరోజు కూడా మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించనున్న ఐటీ అధికారులు. అయితే ఈ రోజు SVC ఆఫీస్‌కు దిల్ రాజును తీసుకెళ్ళి విచారించే అవకాశం ఉంది అంటున్నారు.