పుష్ప 2 సక్సెస్ ని ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్ తో కానీ సెలబ్రేట్ చేసుకోలేని అల్లు అర్జున్ కనీసం పుష్ప 2 విడుదల తర్వాత వెకేషన్స్ కూడా వెళ్ళలేదు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన లో అల్లు అర్జున్ లాకయ్యాడు. ఏ సంతోషాన్ని బయటకి చూపించుకోలేకపోయాడు. క్రిస్టమస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఇలా దేనిని ఫ్యామిలీతో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నట్టుగా ఒక్క ఫోటో కూడా అభిమానులతో పంచుకోలేదు.
తాజాగా అల్లు స్నేహ తన భర్త అల్లు అర్జున్, పిల్లలు అల్లు అయాన్, అర్హ లతో అలిసి ఉన్న పిక్ షేర్ చేసింది. పుష్ప రాజ్ లుక్ నుంచి బయటకొచ్చిన అల్లు అర్జున్ చాలా హ్యాండ్ సమ్ గా స్టయిల్ గా కనిపించారు.
అల్లు కాంపౌండ్ లోనే ఫ్యామిలీతో కలిసి అల్లు అర్జున్ ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పిక్స్ వైరల్ కాగా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు ఫ్యామిలీతో అల్లు అర్జున్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.