మంచు విష్ణు నుంచి రాబోతున్న ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప పై ఇప్పటివరకు ఉన్న క్రేజ్ వేరు, ఇప్పటినుంచి వచ్చే క్రేజ్ వేరు. కారణం పార్వతిగా కాజల్ అగర్వాల్ లుక్, శివుడిగా అక్షయ కుమార్ లుక్స్ వచ్చాక కన్నప్పపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఇప్పుడున్న అంచనాలు మించడానికి మరో అవకాశం ఉంది.
అది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లుక్ కూడా బయటికొస్తే కానీ కన్నప్ప పై ఉన్న ప్రస్తుత అంచనాలు మరింతగా పెరుగుతాయి. అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్స్ భాగమైన కన్నప్ప లో ప్రభాస్ నటించడం ద్వారా క్రేజ్ వచ్చినా.. ప్రభాస్ నందీశ్వరుడి లుక్ బయటికొస్తే ఆ క్రేజ్ పదింతలు పెరగడం ఖాయం.
వచ్చే సోమవారమే కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్ వదిలే ఆలోచనలో కన్నప్ప మేకర్స్ ఉన్నారు.