ఒకప్పుడు సూపర్ హిట్ కథలతో సినిమాలు చేసిన రామ్ గోపాల్ వర్మ కొన్నాళ్లుగా చెత్త సినిమాలు చేస్తూ పిచ్చి పిచ్చిగా తయారయ్యారు. సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ వైసీపీ కి ఫేవర్ గా, టీడీపీ ని పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ పిచ్చి కామెంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఈమధ్యన కామ్ అయ్యారు.
తాజాగా సక్సెస్ తలకెక్కి తాగుబోతునైన... ఎన్నో తప్పులు చేసిన ఇక మారుతా అంటూ రామ్ గోపాల్ వర్మ.. చెప్పడం అందరికి షాకిచ్చారు. నేను చేసిన సత్య సినిమా చూసుకుని ఇలాంటి సినిమా నేనే చేసినా ఇప్పుడు ఏమిటి ఇలాంటి సినిమాలు తీస్తున్నా అని తనకి తానే సిగ్గుపడి కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి అంటూ రియలైజ్ అవుతున్నాడు RGV.
మరి ఎమోషనల్ అవుతూ రామ్ గోపాల్ వర్మ పెట్టిన ట్వీట్ పై నిలబడతారో లేదంటే అనేది చూడాలి.