ఫ్యామిలీ స్టార్ తర్వాత మృణాల్ ఠాకూర్ కి సౌత్ లో అవకాశాలు రావనుకున్నారు. వరసగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టాలనే కసితో కనిపించిన మృణాల్ ఠాకూర్ కి ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ షాకిచ్చింది. దానితో అమ్మడుకి టాలీవుడ్ దర్శకనిర్మాతలు మొహం చాటేశారు అనుకున్నారు, కాదు అన్నారు.
ఇంతలోనే అడివి శేష్ తన డెకాయిట్ సినిమా నుంచి శృతి హాసన్ తప్పుకోవడంతో ఆమె ప్లేస్ లోకి మృణాల్ ని తీసుకొచ్చారు. దానితో సౌత్ సినిమాకి సైన్ చేసిన మృణాల్ అటు బాలీవుడ్ లో కాస్త హడావిడి చేస్తుంది. తాజాగా అజయ్ దేవగన్ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కి బంపర్ ఆఫర్ తగిలింది అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇక సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలకు ఫోజులిచ్చే మృణాల్ ఠాకూర్ తాజాగా ఇచ్చిన భంగిమ చూస్తే నిజంగా మతి పోవాల్సిందే. మోడ్రెన్ డ్రెస్ లో మృణాల్ ఠాకూర్ ఇచ్చిన కిర్రాక్ ఫోజుకి నిజంగా యూత్ కి మతిపోవాల్సిందే.