2019-2024 అధికారం పోగొట్టుకుని.. మళ్లీ గెలుస్తారా అనుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ పొత్తు అమృతంలా పని చేసి చంద్రబాబు మళ్ళీ 2024 జూన్ లో సీఎం అయ్యారు. తనని నమ్మి పొత్తు పెట్టుకుని గెలిపించిన పవన్ కళ్యాణ్ కు తగిన హోదా ఇచ్చారు. కన్న కొడుకు కన్నా ఎక్కువగా పవన్ కళ్యాణ్ ని చూసుకుంటున్నారు.
డిప్యూటీ తో పాటుగా మరికొన్ని మంత్రిత్వ శాఖలతో పవన్ కళ్యాణ్ ను తన పక్కనే పెట్టుకున్నారు. తనకెంత గౌరవం దక్కుతుందో పవన్ కళ్యాణ్ కు అదే మాదిరి గౌరవం దక్కేలా చూసుకుంటూ జనసేన నేతల్లో, కార్యకర్తల్లో ఎలాంటి అనుమాన బీజం పడకుండా చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం ని చెయ్యాలి, కాదు ఆయన సీఎం అవ్వాలనే డిమాండ్స్ చంద్రబాబుకి కొత్త తలనెప్పి తెచ్చేలా చేసాయి.
కొడుకు కదా అని డిమాండ్ లకు తలొగ్గితే పవన్ కళ్యాణ్ ను పక్కనపెట్టాలి, కొడుకు లోకేష్ ను డిప్యూటీ సీఎం ని చేసి, పవన్ కి సీఎం పదవి ఇస్తే తనేం చెయ్యాలి, కొడుకుని తన పక్కనే ఉంచుకోవాలని, తనతో సమానంగా చూసుకోవాలని ఏ తండ్రికి ఉండదు, కానీ కూటమిలో నెంబర్ 2 గా పవన్ ఉండగా కొడుకుకి చంద్రబాబు సముచిత స్థానం ఇవ్వలేరు. అలాగని తన పదవి వదులుకోలేరు. చూద్దాం ఈ తలనెప్పిని చంద్రబాబు ఎలా చక్కదిద్దుతారో అనేది.