శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా ముందుగా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో టాప్ లేపినప్పటికీ.. సినిమా విషయం వచ్చేసరికి ఆమె పెరఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న కేరెక్టర్స్ లోనే కనిపించింది. బాలీవుడ్ లో జాన్వీ కపూర్ కి అనుకున్నంత ఫేమ్ అయితే రాలేదు.
దానితో సౌత్ వైపు చూడడమే తరువాయి గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తో దేవర చిత్రంలో ఛాన్స్ దొరికింది. దెబ్బకి పాప సౌత్ ప్రేక్షకుల దృష్టి లో పడడమే కాదు, దేవర విడుదలకు ముందే మరో హీరో రామ్ చరణ్ తన RC 16 లో ఆఫర్ ఇచ్చాడు. జాన్వీ ఆల్మోస్ట్ సెటిల్ అయినట్లే. ఆమె చెల్లెలు ఖుషి కపూర్ ఎప్పుడెప్పుడు హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తుందా అని సౌత్ నుంచి నార్త్ వరకు ఆడియన్స్ వరకు వెయిటింగ్ చేస్తున్నారు.
అమ్మడు కొద్దిరోజులుగా వేరే లెవల్ అందాలు చూపిస్తూ కవ్విస్తుంది. చాలామందికి జాన్వీ కపూర్ కన్నా ఖుషి అందాలే ఇష్టమని ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. తాజాగా ఖుషి కపూర్ సోషల్ మీడియా పిక్స్ చూస్తే ఈ అందాలను ఎప్పటికి దించుతారో హీరోయిన్ గా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేసేవిలా ఉంది.
మరి ఖుషి కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే గనక అక్క జాన్వీ కి గట్టి పోటీ ఇవ్వడం మాత్రం ఖాయంగానే కనబడుతుంది.