యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గత ఏడాది తాను ప్రేమించిన అమ్మాయి రహస్య గోరఖ్ ను కర్ణాటకలోని ఓ రిసార్ట్స్ లో ఇరు కుటుంబాల నడుమ, సన్నిహితులు, స్నేహితుల మధ్యన గ్రాండ్ గా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తన మొదటి హీరోయిన్ రాజా వారు రాణి గారు ఫేమ్ రహస్య ను ప్రేమించిన కిరణ్ అబ్బవరం పెద్దల అంగీకారంతో గత ఏడాది మార్చ్ 13 న హైదరాబాద్ లోని ఓ ప్రవేట్ ప్లేసులో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు.
రహస్య గోరఖ్ ను కిరణ్ అబ్బవరం గత ఏడాది అక్టోబర్ లో కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. ఆతర్వాత క చిత్రంతో మంచి హిట్ కొట్టాడు. తాజాగా కిరణ్ అబ్బవరం తండ్రి కాబోతున్న గుడ్ న్యూస్ ని అభిమానులతో పంచుకున్నాడు. తన భార్య రహస్య గోరఖ్ ప్రెగ్నెంట్ అనే విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసాడు.
దానితో ఈ జంటకు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అతి త్వరలోనే కిరణ్ ఇంట వారసుడు రాకను స్వాగతిస్తూ ఆ హ్యాపీ మూమెంట్ ను ఫొటోతో పంచుకున్నాడు ఈ యువ హీరో.