సంక్రాంతికి బిగ్ బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్ తోనూ, మీడియం బడ్జెట్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో ఆడియన్స్ ముందుకు వచ్చారు నిర్మాత దిల్ రాజు. గేమ్ చేంజర్ రిజల్ట్ ఎలా ఉన్నా సంక్రాంతి వస్తున్నాం చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ దిశగా పయనించడంతో దిల్ రాజు హ్యాపీ నే.
అందుకే ఐటీ అధికారుల కన్ను దిల్ రాజు ఆయన ఫ్యామిలీపై పడింది. ఈరోజు మంగళవారం ఉదయం దిల్ రాజు, శిరీష్, దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి నివాసాల పై ఐటి సోదాలు నిర్వహించడం హాట్ టాపిక్ అయ్యింది. దిల్ రాజు ఆఫీసు, కుటుంబసభ్యుల ఇళ్లలో, దిల్‌రాజు సోదరుడు, కుమార్తె నివాసంలో ఐటీ సోదాలు ఏకకాలంలో నిర్వహిస్తున్నారు.
55 బృందాలుగా ఐటీ అధికారుల విడిపోయి.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్‌లో ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు ఇంటితో పాటు పుష్ప 2 నిర్మాతలు నవీన్ ఎర్నేని, మైత్రి మూవీస్, మ్యాంగో కార్యాలయలలో సైతం ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు.