నందమూరి ఫ్యాన్స్ కు డాకు మహారాజ్ మేకర్స్ గుడ్ న్యూస్ వినిపించబోతున్నారా, అంటే సోషల్ మీడియాలో కొన్ని ట్వీట్లు అవుననే అంటున్నాయి. డాకు మహారాజ్ విడుదలకు ముందు అభిమానులను డాకు మేకర్స్ డిజప్పాయింట్ చేసారు. సినిమా విడుదలకు ముందు డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసారు.
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనతో డాకు మహారాజ్ కు అనంతపురంలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చెయ్యడంతో అభిమానులు నిరాశపడ్డారు. సినిమా విడుదలై సక్సెస్ అవడంతో కూల్ అయిన అభిమానులకు డాకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారట.
డాకు మహారాజ్ సక్సెస్ సెబ్రేషన్స్ ను అనంతపురంలో ఈనెల 22 న నిర్వహించాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. నందమూరి అభిమానుల నడుమ డాకు మహారాజ్ సక్సెస్ మీట్ నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని టాక్. ఇదే నిజమైతే అభిమానులకు పండగే.