నార్త్ లో బిగ్ బాస్ కి విపరీతమైన ఆదరణ దక్కడంతో.. సౌత్ లోను బిగ్ బాస్ ని మొదలు పెట్టారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో బిగ్ బాస్ ని మొదలు పెట్టగా తెలుగులో ఇద్దరు ముగ్గురు హోస్ట్ లు మారగా అందులో నాగార్జున హోస్ట్ గా సెటిల్ అయ్యారు. రీసెంట్ గానే బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో పూర్తి చేసుకుంది. తమిళనాట కూడా హోస్ట్ గా చేస్తున్న కమల్ హాసన్ తప్పుకోగా అక్కడ విజయ్ సేతుపతి ఆయన ప్లేస్ లోకి వచ్చారు.
ఇక కన్నడలో బిగ్ బాస్ ని హోస్టు చేస్తూ వస్తున్న హీరో సుదీప్ ప్రస్తుతం సీజన్ 11 పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సీజన్ జనవరి 26 తో అంటే వచ్చే ఆదివారంతో ముగియబోతుంది. ఇలాంటి సమయంలో హీరో కిచ్చ సుదీప్ సంచలన నిర్ణయం తీసూన్నారు. ఇంతకుముందు చెప్పినట్టే తానికపై బిగ్ బాస్ ని హోస్ట్ చేయలేనని చెప్పారు.
ఈ సీజన్ ముగియగానే తాను బిగ్ బాస్ హోస్ట్ బాధ్యతల నంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. తాను పూర్తి చెయ్యాల్సిన సినిమాలు, కమిట్మెంట్స్ ఉన్నాయి, కాబట్టే బిగ్ బాస్ ని వదిలేస్తున్నట్టుగా సుదీప్ గతంలోనే ప్రకటించారు. తాజాగా బిగ్ బాస్ ద్వారా వినోదాన్ని అందించానని భావిస్తున్నానని.. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు అంటూ సుదీప్ సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ ని వదిలేస్తున్నట్టుగా అనౌన్స్ చేసారు.