కొద్దిరోజులుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు లోకేష్ ను డిప్యూటీ సీఎం ని చెయ్యాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చెయ్యడం మొదలు పెట్టారు. మరోపక్క జనసేన నేతలు పవన్ కళ్యాణ్ ను సీఎం ని చెయ్యాలనే రాగం ఎత్తుకున్నారు. కొద్దిరోజులుగా నడుస్తున్న ఈ రచ్చకు టీడీపీ అభిష్టానం ఫుల్ స్టాప్ పెట్టింది. టీడీపీ నేతలు, కార్యకర్తలపై అధిష్టానం సీరియస్ అయ్యింది.
లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రచారం ఆపాలని ఆదేశించింది, అనవసరమైన అంశాలను మీడియా ముందు ప్రస్తావించొద్దని, ఏ అంశం అయినా కూటమి పక్షాల అధినేతలు మాట్లాడతారని హైకమాండ్ ఆదేశం జారీ చేసింది.
మరోపక్క లోకేష్ డిప్యూటీ సీఎం అనేది టీడీపీ లో జరుగుతున్న ఒక ప్రహసనం, లోకేష్ Good Book లో చేరటానికి పదవులు దొరకని కొందరు నేతలు నడుపుతున్న డ్రామా ఇది, జనసేన వాళ్ళు ఓవర్ రియాక్ట్ అవ్వకుండా.. మీకు సంబంధంలేని విషయం అనుకుని సైలెంట్ గా ఉంటే బెటర్, బాబుగారు లోకేష్ దావోస్ నుంచి రాగానే ఈ డ్రామా ముగుస్తుంది, ఈ పనికిమాలిన డ్రామా వల్ల టీడీపీ కి నష్టం.. అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు.
ఏది ఏమైనా లోకేష్ ను డిప్యూటీ సీఎం ని చేయాలంటూ చాలామంది చంద్రబాబు పై ఒత్తిడి తెస్తున్నారు, బాబు గారు మాత్రం ఈ విషయంలో అంత సుముఖంగా ఉన్నట్లుగా అయితే కనిపించడం లేదు.