పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. దానితో పాటుగా ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఫౌజీ కి సంబందించిన ఓ షెడ్యుల్ పూర్తి కాగా.. ఇప్పుడు ఈ చిత్రం కోసం ఫౌజీ టీమ్ తమినాడులోని ఓ అగ్రహారానికి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఫౌజీ లో ప్రభాస్ బ్రాహ్మణ కుర్రాడిగా కనిపించబోతున్నాడట. దేవీపురం అగ్రహారం నేపథ్యంలో ఓ 20 రోజుల షూటింగ్ కోసం హను రాఘవపూడి తమిళనాడుకి తన టీమ్ తో కలిసి పయనమయ్యారట. ఈ షెడ్యూల్ కి ప్రభాస్ కూడా అందుబాటులో ఉంటారని, అందుకే హను రాఘవాపుడి ఈ షెడ్యూల్ ని భారీగానే ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్ గా కనిపిస్తుంది. ప్రభాస్ బ్రాహ్మణ కుర్రాడిగా, అలాగే సైనికుడిగా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనువిందు చేయబోతున్నాడని అంటున్నారు.