అసలు ఏపీలోనూ అందులోను కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది. చంద్రబాబు-పవన్ కళ్యాణ్ చక్కగా కలిసి మెలిసి అధికారాన్ని షేర్ చేసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్, సీఎం గా చంద్రబాబు ఇధ్దరూ బాగానే ఉన్నారు. కానీ కార్యకర్తల నడుమ మాత్రమే కాదు, నేతల మధ్యన ఏదో అసంతృప్తి.
అటు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని జనసేన కార్యకర్తలు కలలు కంటున్నారు. మరోపక్క లోకేష్ ని డిప్యూటీ సీఎం ని చెయ్యాలనే డిమాండ్ టీడీపీ పార్టీలో ఎక్కువైంది. టీడీపీ నేతలు కూడా లోకేష్ ని డిప్యూటీ సీఎం అవ్వాలనే కోరిక చూపిస్తున్నారు. చంద్రబాబు పవన్ ని సీఎం ని చేసెయ్యాలి, లోకేష్ ని డిప్యూటీ సీఎం ని చెయ్యాలి.
ఆయన ఏ గవర్నర్ కిందో, లేదంటే ఉపరాష్ట్రపతిగానో వెళ్లిపోవాలంటూ సొషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడడం గమనార్హం. మరి ఇదంతా చంద్రబాబు దృష్టికి వెళ్లకుండానే ఉంటుందా, పవన్ వినిపించుకోకుండానే ఉంటారా, ఇప్పటికే అభిమానుల కోసం డిప్యూటీ సీఎం అనే హోదా తీసుకున్నారు పవన్.
ఇపుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ సీఎం, డిప్యూటీ సీఎం వార్తలపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.