కూటమి ప్రభుత్వంలో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పని చేస్తున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మద్యన స్నేహపూర్వక వాతావరణమే కనిపిస్తుంది. కానీ కార్యకర్తల నడుమ అలాంటి వాతావరణం కనిపించడం లేదు. టీడీపీ కార్యకర్తలు vs జనసేన కార్యకర్తలు నడుమ యుద్ధ వాతావరణమే కనబడుతుంది.
సోషల్ మీడియాలోఒకరికి ఒకరు వ్యతిరేఖంగా మట్లాడడం, పోస్ట్ లు పెట్టడం చేస్తున్నారు. ఈమధ్యన టీడీపీ కి సపోర్ట్ గా అంటే జనసేనాని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వారి రాకను డైజెస్ట్ చేసుకోలేని మహాసేన రాజేష్ కొత్తగా నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాడు అంటే ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ను తప్పించాలనేది రాజేష్ డిమాండ్ అన్నమాట.
ఆ విషయంలో మహాసేన రాజేష్ పై ఎలాంటి యాక్షన్ తీసుకోని టీడీపీ హైకమాండ్ పై జనసేన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అందుకే వారు జనసేన లో ఉండి టీడీపీ ని ముందు నుంచి వ్యతిరేకిస్తున్న దిలీప్ సుంకరను జనసేన నెత్తినెట్టుకుంటుందట.
మా అందరి స్టాండ్ ఇదే..!
జనసేన నీ వ్యతిరేకించిన మహసేన రాజేష్ కి మీరు అఫిషియల్ గా సపోర్ట్ చేస్తున్నారు..! అలానే మేము కూడా టీడీపీ వ్యతిరేకంగా ఉండే దిలీప్ కి మా సపోర్ట్ ఇస్తాం ..! అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. మరి ఈ లెక్కన జనసేన vs టీడీపీ అనేది అఫీషియల్ గా మొదలైనట్టే కనబడుతుంది వ్యవహారం.