Advertisementt

అఖిల్ పెళ్ళికి ముహూర్తం కుదిరింది

Sun 19th Jan 2025 08:22 PM
akkineni akhil  అఖిల్ పెళ్ళికి ముహూర్తం కుదిరింది
Akhil Akkineni wedding date out అఖిల్ పెళ్ళికి ముహూర్తం కుదిరింది
Advertisement
Ads by CJ

గత ఏడాది కింగ్ నాగార్జున తన పెద్ద కొడుకు నాగ చైతన్య వివాహ తేదీ నిశ్చయించిన కొద్దిరోజులకే తన చిన్న కొడుకు అఖిల్-జైనాబ్ రవద్జీ ఎంగేజ్మెంట్ చేసి అందరికి షాకిచ్చారు. నాగ చైతన్య-శోభిత ల పెళ్లి డిసెంబర్ 5 న జరిగింది. జైనాబ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్ వెడ్డింగ్ తేదీపై అందరిలో క్యూరియాసిటీ నడుస్తుంది. 

అంతేకాదు ఈ మధ్యన అఖిల్ చాలా సీక్రెట్ గా తన కొత్త ప్రాజెక్ట్ పైకి వెళ్లిపోయాడని, వినరో భాగ్యము దర్శకుడితో అఖిల్ కొత్త సినిమా మొదలు పెట్టాడని అన్నారు కానీ.. అఫీషియల్ కన్ఫర్మమేషన్ లేదు. తాజాగా అఖిల్-జైనాబ్ రవద్జీ పెళ్లి తేదీ ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. మార్చి24న అక్కినేని వారసుడు అఖిల్-జైనల్‌ల వివాహం ఘనంగా జరగబోతున్నట్లు సమాచారం.

అఖిల్ పెళ్లికి సంబంధించిన పూర్తి పనులను అక్కినేని, జైనాబ్ కుటుంబ సభ్యులు కలిసి చూసుకోబోతున్నారట. అఖిల్ పెళ్లిని అంగరంగ వైభవముగా నిర్వహించేందుకు నాగార్జున అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని, అఖిల్-జైనాబ్ పెళ్ళికి బిజినెస్ పర్సన్స్‌తో పాటు సినీ సెలబ్రిటీలు, క్రికెటర్స్ హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది.

Akhil Akkineni wedding date out:

Akkineni Akhil marriage date fix

Tags:   AKKINENI AKHIL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ