తన ఫిట్‌నెస్‌కు ఎలాంటి ప్రత్యేక రహస్యం లేదని నందమూరి బాలకృష్ణ తెలిపారు. షూటింగ్ సమయంలో అందుబాటులో ఉండే ప్రొడక్షన్ ఫుడ్ మాత్రమే తింటానని వెల్లడించారు. డాకు మహారాజ్ ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్న బాలయ్య, ఈ విషయంలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. తాను ఎక్కడైనా షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు హోం ఫుడ్ బదులు ప్రొడక్షన్ ఫుడ్‌నే ఎంచుకోవడం అలవాటుగా మారిందని చెప్పారు.
బాలకృష్ణ తెలిపిన మరో ఆసక్తికర విషయమేమిటంటే, తన ఇంటి సమీపంలో షూటింగ్ జరిగినా.. తాను మాత్రం ప్రొడక్షన్ ఫుడ్‌ను వదలకుండా తింటానని.. ఇది చూసి తన భార్య వసుంధర తాను ఎందుకు ఇంటి ఫుడ్ తినడం లేదని అనటానికి ప్రయత్నిస్తుందని, అయినా తాను మాత్రం తన అలవాట్లను మార్చుకోలేదని చెప్పుకొచ్చారు. తాను ఇంత ఫిట్‌గా, ఎనర్జీగా ఉండటానికి ప్రధాన కారణం కూడా షూటింగ్ సమయంలో తీసుకునే ఇండస్ట్రీ ఫుడ్‌నేనని చెప్పుకొచ్చారు.
ఈ కామెంట్స్ చేసిన తర్వాత, బాలయ్య చెప్పిన మాటలపై ఆయన అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కొందరు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆయన సరదా కామెంట్లను పొగడగా, మరికొందరు బాలయ్య చేస్తున్న ఈ పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలయ్య ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా అభిమానులకు మరింత దగ్గరయ్యారు.