Advertisementt

అకీరా ఇష్టాలు-చరణ్ కామెంట్స్

Sat 18th Jan 2025 08:14 PM
ram charan  అకీరా ఇష్టాలు-చరణ్ కామెంట్స్
Ram Charan reveals details about Akira Nandan అకీరా ఇష్టాలు-చరణ్ కామెంట్స్
Advertisement
Ads by CJ

కొన్ని రోజులు ముందు అంటే ఎలక్షన్స్ సమయంలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ తన తండ్రి పక్కన ఉన్నాడు. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా అకీరా మీద అభిమానులు, పబ్లిక్ ల ఫోకస్ పెరిగింది. అయితే అకీరాను హీరోగా లాంచ్ చేయాల్సిన సమయం వచ్చిందని సోషల్ మీడియా వేదికగా అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అకీరా నటనకు, హీరోగానే ఉండేందుకు అవసరమైన శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. పవన్ అభిమానులైతే అకీరా తెరంగేట్రం గురించి ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసే అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ గెస్ట్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అకీరా ఎంట్రీ గురించి చరణ్ స్పందిస్తూ, అకీరా చదవటంలో తండ్రి పవన్ కళ్యాణ్‌కి పోటీ అని, భారతీయ సంస్కృతిపై ఆయనకు మంచి అవగాహన ఉందని తెలిపారు. అంతేకాదు, అకీరా పియానో అద్భుతంగా వాయించగలడని, తన బర్త్ డేకు ప్రతిసారీ బుక్స్ కానుకలుగా ఇస్తాడని చరణ్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు అకీరా అభిమానులలో అంచనాలను పెంచాయి.

చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలతో, అకీరా నందన్ త్వరలోనే సినీ రంగ ప్రవేశం చేసే అవకాశాలు ఉంటాయని మరింత బలంగా ప్రచారం జరుగుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన మాటలతో అకీరా ఎంట్రీపై స్పష్టతనిచ్చినట్లు భావించగా, పవన్ అభిమానులు ఈ వార్తపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అకీరా నందన్ ఒక మంచి ప్రారంభంతో తన కేరీర్ ప్రారంభిస్తాడని ఆశిస్తూ, అభిమానులు అతని ఫస్ట్ మూవీకి వేడుకలా ఎదురుచూస్తున్నారు.

Ram Charan reveals details about Akira Nandan:

Ram Charan About Akira Nandhan 

Tags:   RAM CHARAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ