అమరావతి రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించి టీడీపీ ఎమ్యెల్యే టికెట్ సంపాదించి తిరువూరు నియోజకవర్గం నుంచి ఎమ్యెల్యే అయిన కొలికపూడి శ్రీనివాస్.. ఆతర్వాత అధిష్టానానికి కొరకరాని కొయ్యగా తయారయ్యాడు.
తాజాగా మరోసారి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం పై టిడిపి హై కమాండ్ సీరియస్ అయ్యింది. సోమవారం టిడిపి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు అవ్వాలని కొలికపూడికి ఆదేశాలు జారీ చేసింది.
జనవరి 11వ తేదీన ఏ కొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఒక ఎస్టి మహిళపై కొలికిపూడి శ్రీనివాస్ దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న టిడిపి హై కమాండ్, ఘటనకు సంబంధించిన కారణాలను క్రమశిక్షణ కమిటీ ముందు తెలపాలన్న అధిష్టానం.
తిరువూరులో జరిగిన ఘటనపై ఇప్పటికే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు క్రమశిక్షణ కమిటీ ముందు కొలికిపూడి శ్రీనివాస్ ఇచ్చే వివరణ ను హైకమాండ్ దృష్టికి తీసుకు వెళ్ళనున్న క్రమశిక్షణ కమిటీ బృందం. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కొలికపుడిపై తదుపరి చర్యలు తీసుకోనున్న పార్టీ అధిష్టానం.