Advertisementt

పవన్ తో తలపడబోతున్న నితిన్

Sat 18th Jan 2025 04:41 PM
nithin  పవన్ తో తలపడబోతున్న నితిన్
Hari Hara Veera Mallu vs Robinhood పవన్ తో తలపడబోతున్న నితిన్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ యువహీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. మార్చి 28, 2025న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఒక పోస్టర్ ద్వారా ధృవీకరించింది.

వాస్తవానికి రాబిన్ హుడ్ గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండేది. కానీ అనుకోని కారణాల వల్ల చిత్ర బృందం విడుదలను వాయిదా వేయడం జరిగింది. ఈ సమయంలోనూ విడుదల తేదీని ఖరారు చేస్తూ, కొత్త అనౌన్స్‌మెంట్ చేశారు. అంచనాల మధ్య ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.

అదేరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కూడా విడుదల కానుంది. ఈ విడుదల తేదీ కారణంగా నితిన్, పవన్ మధ్య ఒక రకమైన పోటీ ఏర్పడినట్లే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ అంటే ఎనలేని అభిమానం, దేవుడు అంటూ పూజించే నితిన్, తన అభిమాన హీరోతోనే బరిలోకి దిగడం ఆసక్తికరంగా మారింది.

ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వెంకీ కుడుముల, నితిన్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుందని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది. రాబిన్ హుడ్ టీజర్, పోస్టర్లు ఇప్పటికే సినిమా పై హైప్‌ని పెంచాయి. మార్చి 28న నితిన్ పవర్‌ఫుల్ యాక్షన్ అవతారంలో అభిమానుల ముందుకు రాబోతున్నాడు.

Hari Hara Veera Mallu vs Robinhood:

Pawan Kalyan vs Nithin 

Tags:   NITHIN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ