హరి హర వీరమల్లు సాంగ్ రెడీ అయ్యి చాలా కాలమైంది, రిలీజ్ డే కోసం వెయిటింగ్ లో ఉంది. కేవలం పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసిన, యాక్సెప్ట్ చేసిన డేట్ రోజున ఆ పాట విడుదల కావాల్సి ఉంది. ఇదే చిన్న బిట్ సాంగ్.. కానీ తన అభిమానుల కొరకు తనిచ్చే ట్రీట్ సాంగ్. భోగి రోజునో, సంక్రాంతో రోజునో రావొచ్చు.
కానీ.. ఓ పర్టిక్యులర్ డేట్ ఆయన చెప్పడం, అదే రోజు ఆ పాట రిలీజ్ కావడం జరిగింది. ఇంత చిన్న బిట్ సాంగ్ గురించి చర్చించాల్సి వస్తుంది అంటే అదే రోజు సాయంత్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేటర్ లో ప్రధాని నరేంద్ర మోడీ వద్ద నుంచి ప్రకటన వెలువడింది. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రధానికి చాలా సన్నిహితంగా మెలిగే పవన్ కావాలనే ఈ డేట్ ని ఎంచుకున్నారా, నా మాట ప్రకారమే ఇదంతా జరిగింది అనిపించుకోవాలని అనుకున్నారా, అందుకే ఆ ప్రత్యేకమైన తేదీనే ఎంచుకున్నారా అనేది ఆసక్తికరమైన విషయం, ఆలోచించాల్సిన విషయం.
విడుదలైన అంత చిన్న లెంగ్త్ ఉన్న బిట్ సాంగ్ కి ప్రతి లాంగ్వేజ్ లోను తన గొంతే వినిపించాలనే తాపత్రయం పవన్ కళ్యాణ్ లో కనిపించింది. దీని వెనుక జాతీయ స్థాయి నాయకుడిగా ముందుకెళ్లాలని ఆయన తాపత్రయం తెలుస్తోంది అంటున్నారు విశ్లేషకులు.