సమయం పాటించడమనేది చాలా ఇంపార్టెంట్ అంటూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ NBK విత్ అన్ స్టాపబుల్ టాక్ షోలో చెప్పడం అనేది ఆయనలోని పరిపక్వతను చూపించింది. గేమ్ చేంజర్ విడుదలకు ముందే రామ్ చరణ్ బాలయ్య టాక్ షో అన్ స్థాపబుల్ టాక్ షోకి హాజరయ్యారు. బాలయ్య తో సరదాగా మాట్లాడిన రామ్ చరణ్ తన మెచ్యురిటిని చూపించి సర్ ప్రైజ్ చేసారు.
సమయం పాటించడమనేది మోస్ట్ ఇంపార్టెన్స్ అండి, కాలమే చాలావరకు ఆన్సర్స్ ఇస్తుంది. ప్రతిదానికి రెస్పాండ్ అవడం అంటే యాక్షన్ అవ్వగానే రియాక్షన్ ఇవ్వడం అని తాపత్రయ పడకుండా.. మనకి అనుకూల సమయం వచ్చేవరకు వేచి చూడడం అనేది అతి ముఖ్యం.
ఇంకా ప్రతి సంవత్సరం మనదే అవదు. ప్రతివారం మనదే అవదు, ప్రతి నెల మనదే అవదు, కొన్నిసార్లు మనకు ఫెంటాస్టిక్ గా ఉంటుంది, కొన్నిసార్లు మనకు అనుకూలంగా ఉండదు అనేది.. ఫస్ట్ మనం యాక్సప్ట్ చెయ్యాలి అంటూ రామ్ చరణ్ బాలయ్య టాక్ షోలో మాట్లాడిన మాటలు గెలుపోటములు లెక్క కాదు.. దానిని బ్యాలెన్స్ చెయ్యడమనేది ముఖ్యం అంటూ చరణ్ చెప్పిన ఫిలాసఫీ ఇప్పుడు వైరల్ అయ్యింది.