Advertisementt

థమన్ ఎమోషనల్-చిరు ఓదార్పు

Sat 18th Jan 2025 11:49 AM
chiranjeevi  థమన్ ఎమోషనల్-చిరు ఓదార్పు
Thaman is an emotional-Chiru consolation థమన్ ఎమోషనల్-చిరు ఓదార్పు
Advertisement
Ads by CJ

సోషల్ మీడియాలో సినిమాలపై నెగిటివిటీపై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ డాకు మహారాజ్ ఈవెంట్ లో ఎమోషనల్ అవడం చూసిన మెగా స్టార్ చిరంజీవి చలించిపోయి సోషల్ మీడియా వేదికగా థమన్ ను ఓదార్చుతూ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. 

డియర్ థమన్ 

నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా  అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. 

విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, Words can inspire. And Words can destroy. Choose what you wish to do. మనం పాజిటివ్ గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుంది..అంటూ థమన్ ను ఓదారుస్తూ ట్వీట్ చేసారు. 

Thaman is an emotional-Chiru consolation:

Chiranjeevi emotional note consoling Thaman

Tags:   CHIRANJEEVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ