Advertisementt

పుష్ప 2 రీలోడెడ్: కొత్త సీన్స్‌తో మరింత ఉత్కంఠ

Fri 17th Jan 2025 08:05 PM
pushpa the rule  పుష్ప 2 రీలోడెడ్: కొత్త సీన్స్‌తో మరింత ఉత్కంఠ
Pushpa2 extended version enthralling పుష్ప 2 రీలోడెడ్: కొత్త సీన్స్‌తో మరింత ఉత్కంఠ
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ వెర్షన్‌లో 20 నిమిషాల కొత్త సన్నివేశాలు జోడించడంతో కథ మరింత ఉత్కంఠభరితంగా మారింది.

పుష్పరాజ్ చిన్నతనంలో స్నేహితులు పెట్టిన పోటీ వల్ల చెరువులోకి దూకడం, మంగళం శ్రీను, ఎస్పీ షెకావత్ మధ్య స్మగ్లింగ్ ప్లానింగ్, అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్వర్క్‌లలో చోటుచేసుకున్న మార్పులు కథను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాయి. పుష్ప, జపాన్ చేరుకుని "పుష్ప మనీ" అనే సరికొత్త వ్యూహాన్ని ప్రవేశపెడుతాడు. ఈ సీన్స్ అంతర్జాతీయ స్మగ్లింగ్ లావాదేవీలను మరింత ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దాయి.

ఇతర ప్రధాన సన్నివేశాల్లో రావు రమేష్, జగపతిబాబు మధ్య రాజకీయ కుట్రలు, జక్కారెడ్డి మరణం, జాలిరెడ్డి మీద పుష్ప ప్రతీకారం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. చివరగా, కావేరి పెళ్లి సమయంలో పుష్పకి లాకెట్ తిరిగి ఇవ్వడం, అది తర్వాత ఓ పేలుడికి దారి తీసి పుష్ప 3 - ది ర్యాంపేజ్ కి లీడ్ చేయడం కథకు కొత్త మలుపు తీసుకొచ్చింది.

ఈ కొత్త సన్నివేశాలు కథనానికి లోతు చేకూర్చి ప్రేక్షకులను థియేటర్లకు మరింత దగ్గర చేశాయి.

Pushpa2 extended version enthralling:

Pushpa The Rule extended version getting screened from today

Tags:   PUSHPA THE RULE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ