Advertisementt

సైఫ్ అలీ ఖాన్ హెల్త్ పై వైద్యుల ప్రకటన

Fri 17th Jan 2025 04:10 PM
saif ali khan  సైఫ్ అలీ ఖాన్ హెల్త్ పై వైద్యుల ప్రకటన
Saif Ali Khan health update సైఫ్ అలీ ఖాన్ హెల్త్ పై వైద్యుల ప్రకటన
Advertisement
Ads by CJ

నిన్న గురువారం తెల్లవారుఝామున ఇంట్లోకి దొంగ చొరబడగా.. అతని నుంచి ఫ్యామిలీని రక్షించుకునే క్రమంలో సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్ల బారిన పడి ఆసుపత్రి పాలయ్యాడు. ఆ దొంగ ఆరుసార్లు సైఫ్ ను కత్తితో పొడవడంతో రక్తం మడుగులో ఉన్న సైఫ్ ని అతని కొడుకు ఇబ్రహీం ఆటోలో లీలావతి ఆసుపత్రికి తరలించారు. 

నిన్నసాయంత్రం సైఫ్ ఆరోగ్యం పై లీలావతి వైద్యులు ప్రకటన జారీ చేశారు. సైఫ్ గాయాలకు శాస్త్ర చికిత్స నిర్వహించామని, ఆయన బాగానే ఉన్నారు, ప్రాణాలకు ప్రమాదం లేదు అని ప్రకటించారు. ఈరోజు శుక్రవారం మరోసారి సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం పై వైద్యులు ప్రకటన విడుదల చేసారు. సైఫ్ ఆరోగ్యం మెరుగ‌వుతోంది. 

ప్రస్తుతం ఆయన మాట్లాడ‌గ‌లుగుతున్నారు. న‌డ‌వ‌గ‌లుగుతున్నారు. వెన్ను నుంచి క‌త్తి మొన‌ను తొల‌గించాం. ఆయనకు తగిలి గాయాల కార‌ణంగా ఇన్‌ఫెక్ష‌న్ అయ్యే ప్ర‌మాదం ఉంది. అందుకే కొద్దరోజుల పాటు రెస్ట్ తీసుకోవాల‌ని ఆయ‌నకు చెప్పాం. రేపు సైఫ్‌ను ఐసీయూ నుంచి స్పెష‌ల్ రూమ్‌లోకి షిఫ్ట్ చేస్తాం. కొన్ని రోజుల అబ్జర్వేషన్ త‌ర్వాత సైఫ్‌ను డిశార్జ్ చేస్తాం అంటూ సైఫ్ హెల్త్ అప్ డేట్ అందించారు వైద్యులు. 

Saif Ali Khan health update :

Lilavati doctors call Saif Ali Khan a hero

Tags:   SAIF ALI KHAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ