ఈ సంక్రాంతికి ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. మొదటిసారి దిల్ రాజు పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శత్వంలో నిర్మించిన గేమ్ చేంజర్ సంక్రాంతి స్పెషల్ గా జనవరి 10 న విడుదలైంది. కానీ గేమ్ చేంజర్ దిల్ రాజు కి పెద్ద షాక్ ఇచ్చింది.
కలెక్షన్స్ పోస్టర్ వేసినా ట్రోల్ అయ్యేలా గేమ్ చేంజర్ రిజల్ట్ కనిపించడంతో దిల్ రాజు బాగా డిజప్పాయింట్ అయ్యారు. గేమ్ చేంజర్ తో ఎంత లాస్ వచ్చిందో తెలియదు కానీ.. దిల్ రాజు కి అదే సంక్రాంతికి మరో సినిమా బిగ్ రిలీఫ్ నిచ్చింది. దిల్ రాజు నిర్మాతగా ఆయన లక్కీ దర్శకుడు అనిల్ రావిపూడి దిల్ రాజు ని ఆదుకున్నాడు.
దిల్ రాజు సంక్రాంతి కింగ్ అన్న పేరుని సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నిలబెట్టింది. ఈ చిత్రం మూడు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ సాధించింది. ఇప్పటికే చాలాచోట్ల సంక్రాంతికి వస్తున్నాం బ్రేక్ ఈవెన్ అవడమే కాదు, అప్పుడే లాభాల బాటలోకి వెళ్ళిపోయింది. వారం తిరగలేదు, అప్పుడే బ్రేక్ ఈవెన్ అంటే ఇకపై వచ్చేవన్ని లాభాలే.
మరి గేమ్ చేంజర్ తో లాస్ అయినా.. సంక్రాంతికి వస్తున్నాం తో దిల్ రాజు కి లాభాలు రావడం మాత్రం పక్కా.. మరొక వారం సంక్రాంతికి వస్తున్నాం తో దిల్ రాజు కి లాభాలే లాభాలన్నమాట.